మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??
మహేష్ మరోసారి తన ఉన్నత వ్యక్తిత్వన్ని చాటుకున్నాడు ....
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి గృహప్రవేశ ని కి వేల్లాడు . ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుటున్నరా ??? అక్కడే ఉంది ట్విస్ట్ ... .మహేష్ ని ఈ పొగ్రమ్ కు ఎవరు పిలవలేదు ... సుకుమార్ హైదరాబాద్ లో ఈ మధ్యనే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా చేద్దామని తనకు బాగా తెలిసిన కొద్ది మంది అతిధులను మాత్రమే ఆహ్వానించాడు. అయితే సుకుమార్ కు హీరో అల్లుఅర్జున్ కూ ఉన్న సన్నిహితం వల్ల ఈ కార్యక్రమానికి బన్నీని ఆహ్వానించడం బన్నీ రావడం జరిగిందట.
సుకుమార్ ఇంటి గృహప్రవేశ ముహూర్తం తెల్లవారుజామున 2 గంటలకు అవడంతో ఆ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ ను సుకుమార్ తన ఇంటి గృహప్రవేశానికి పిలవ లేదట. అయితే తాను నటిస్తున్న ‘1’ సినిమా నిర్మాతల ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకున్న మహేష్ తనను సుకుమార్ పిలవక పోయినా అంత రాత్రి తన భార్య నమ్రతతో కలిసి ఆ కార్యక్రమానికి హాజరై సుకుమార్ కు షాక్ ఇచ్చాడట. అక్కడే అదే కార్యక్రమంలో సుకుమార్ తో ఉన్న బన్నీతో తెల్లారే వరకూ సినిమాలు రాష్ట్ర రాజకీయాల పై పిచ్చా పాటి మాట్లాడుకున్నారట. మరొక ఆశక్తి కర విషయం ఏమిటంటే ఇలా అభిమానంగా మాట్లాడుకున్న వీరిద్దరి సినిమాలు ‘1’ నేను ఓక్కడినే, ‘రేసు గుర్రం’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటాపోటీ గా విడుదల కాబోతుండటం ట్విస్ట్. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అనీ మరోసారి నిరుపించాడు ప్రిన్స్ ... .