Friday, 19 April 2013

అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?

‘అత్తారింటికి దారి’ పవన్ మూవీ పేరు?   గబ్బర్‌సింగ్ సినిమా హిట్ తో మంచి  జోష్  తో తెలుగు
ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నా పవర్ స్టార్ పవన్
కల్యాణ్ తరువాత రిలీజ్ అయిన  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన
కెమేరామేన్ గంగతో రాంబాబు సినిమా నిరాశపరచడంతో పవన్ తాజాగా త్రివిమ్
శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాను నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
నేపధ్యంలో పవన్ కల్యాణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట.

 పవన్ కల్యాణ్‌కు జల్సాతో బ్రేక్ ఇచ్చిన
త్రివిక్రమ్‌పై నమ్మకముంచి ఈ సినిమాను పవన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ -
పవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి చాలా రకాల టైటిళ్లు అనుకున్నారట.
‘సరదా’, హరేరామ హరేకృష్ణ మొదలగు పేర్లలను పరీశీలించినట్లు సమాచారం. అయితే
చివరిగా ‘అత్తారింటికి దారి’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు విశ్వసనీయ
వర్గాలు చెబుతున్నారు.

సినిమాలో పవన్ సరసన సమంత నటిస్తుంది. సమంతకు తల్లిగా మిర్చి సినిమాలో
ప్రభాస్‌కు తల్లిగా నటించిన నదియా  నటిస్తుంది. ప్రణిత కీలకమైన పాత్ర పోషిస్తున్న  ఈ సినిమా కు  ‘అత్తారింటికి దారి’
అనే టైటిల్‌ను అనుకుంట్టున్నరట్ట  నదియా అత్తగా లీడ్ రోల్ పోషించనుందట. ఈ చిత్రానికి
దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. posted by venkatesh.gurrala

Monday, 15 April 2013

సానియా కీ ఇంత త్వరగా ఎలా వచ్చిందీ ??

 భారత టెన్నిస్ ఆటగాళ్ల సంఘం (ఐటీపీఏ) ఉపాధ్యక్షురాలిగా భారత స్టార్ క్రీడాకారిణి, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా ఎంపికైంది. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ సంఘంలో ఆమె కూడా ఇటీవలే సభ్యత్వం స్వీకరించారు. ఆ వెంటనే ఉపాధ్యక్షురాలిగా కూడా ఎంపికయ్యారు. ఇంత త్వరగా సానియా  ఎం
 
పిక  అవటం గూర్చి చాలామందీ గుసగుసలడుకుంటున్నారు ... 

కొత్తగా ఏర్పాటైన ఐటీపీఏలోని నలుగురు ఉపాధ్యక్షుల్లో సానియా ఒకరని ఐటీపీఏ కార్యదర్శి, జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు కూడా అయిన కార్తీ చిదంబరం ఆదివారం తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఐటీపీఏ ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన సానియా ఆ పదవికి ఏకగ్రీవంగా ఎంపికైనట్టు చెప్పారు.

కాగా వెటరన్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ వర్మన్‌లు మిగతా ముగ్గురు ఉపాధ్యక్షులు. భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ జైదీప్ ముఖర్జీ ఐటీపీఏకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎంతైనా గ్లామర్ ఉంటే ఎలాంటీ పదవులకైనా
ఏకగ్రీవంగా ఎంపిక  అవచ్చు .....   ఏమమంటారు ??

10కోట్లు మార్క్ దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.

10కోట్లు మార్క్  దాటీన చిన్న సినిమా కలేక్షన్స్.    హ్యాపీ డేస్ హీరో నిఖిల్ పెద్ద హిట్టే కొట్టాడు.హ్యాపీ డేస్ తరువాత పేద్దగా  హిట్లు లేనీ ఈ హీరో మూవీ స్వామీ రా రా ...   ఏలంటీ హడావీడి లేకుండా వీడుదల అయి  యావరేజ్ టాక్‌తో మొద‌లై హిట్టైపోయింది... స్వామి రారా సినిమా. ఈ సినిమా త‌ర‌వాత సుధీర్ వ‌ర్మ చుట్టూ  ఈగ‌ల్లా మూగిపోయారు నిర్మాత‌లు. ఆయ‌న పారితోషికం కాస్త  గట్టీ గా  డిమాండ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎనిమిది కోట్లు రాబ‌ట్టింది. అయిన ఖ‌ర్చు మూడేన‌ట‌. అంటే రూ.7కోట్లు లాభం తెచ్చింద‌న్న‌మాట‌. చిన్న సినిమాకి ఇది పెద్ద విజ‌య‌మే. అందుకే నిర్మాత‌లు సుధీర్ వ‌ర్మ అడిగిన బ‌డ్జెట్‌ని అందివ్వ‌డానికి ఏమాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. అటు నిఖిల్‌కీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పాపం.... సినిమాలేనిద‌ల్లా స్వాతికే .
 
స్వాతిమళ్ళీ  తమిళ్ లో  ట్రై చేయ్యటమేనా ??

Monday, 1 April 2013

మరీ ఇంత సన్నబడీతే ఎలా??

ఇలియానా లేటెస్ట్ స్టిల్స్ చూడండీ..


బాలీవుడ్ మోజులో పడిన ఇలియానా అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని తన శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘బర్ఫీ' చిత్రం మంచి విజయం సాధించడంతో షాహిద్ కపూర్ సరసన ‘పథా పోస్టర్ నిఖ్లా హీరో' అనే చిత్రంలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. కాగా...ఒకప్పుడు ఇలియానాను సన్ననడుము సుందరి అంటూ దక్షిణాది ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే రాను రాను అమ్మడు జీరో సైజు మోజులో పడి మరీ బక్క చిక్కడంతో ఆమె అందంపై చాలా మందికి మోజు తీరి పోయింది. దీంతో ఇలియానా అందంపై విమర్శలు రావడం మొదలయ్యాయి.మరీ ఇంత సన్నబడీతే  ఎలా ఇలియానా??